7382679767 నెంబర్ కు మెసేజ్ చేయండి, వెంటనే మీకు గ్రూప్ లింక్ వస్తుంది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.
తిరుమలలో రద్దీ తగ్గింది , దర్శనం టికెట్ లేనివారికి 8-10గంటల సమయం పడుతుంది
వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తేదీన రావడం జరిగింది . తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఇచ్చే ఉత్తర ద్వారా దర్శనం 10 రోజుల పాటు ఇవ్వనున్నారు . జనవరి 10వ తేదీ నుంచి 19 వరకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించనున్నారు. వీటికి సంబంధించిన టికెట్స్ గురించి టీటీడీ ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు కాకపోతే ఈ టికెట్స్ డిసెంబర్ లో ఇవ్వనున్నట్టు సమాచారం.
తిరుమల టికెట్స్ లేకుండా వెళ్లేవారికి తిరుపతి లో అనగా కొండ క్రింద టికెట్స్ ఇస్తున్నారు.
1. విష్ణు నివాసం లోను 2. శ్రీనివాసం లోను టికెట్స్ ఇస్తున్నారు.
తిరుమల నడిచి వెళ్లే మార్గాలు రెండు కలవు
1. అలిపిరి మెట్లమార్గం ఈ మార్గం లో వెళ్లే వారికి భూదేవి కాంప్లెక్స్ లో టికెట్స్ ఇస్తున్నారు. మీరు టికెట్స్ తీసుకుని బస్సు లో కూడా వెళ్ళవచ్చు. ఇప్పటివరకు చెప్పిన 3 ప్రదేశాలలో తెల్లవారు జామున 2 గంటల నుంచి టికెట్స్ ఇస్తున్నారు.
2. శ్రీవారి మెట్టు
ఈ మార్గం లో వెళ్లేవారికి మొదటి మొట్ట దగ్గరే టోకెన్ లు ఇస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి టికెట్స్ ఇస్తున్నారు. ఇవి దివ్య దర్శనం టికెట్స్ అనగా నడిచి వెళ్లినందుకు త్వరగా దర్శనం అవుతుంది.
అలిపిరి మెట్ల మార్గం సమయాలు : 4am - 10pm
శ్రీవారి మెట్ల మార్గం సమయాలు : 6am - 6pm
Note : టికెట్స్ ఎప్పటివరకు ఉంటాయని ఎవరు చెప్పలేరు , టికెట్స్ ఉన్నంత వరకు ఇచ్చి కౌంటర్ మూసి వేస్తారు.
దర్శనం టికెట్స్ లేకుండా వెళ్తున్నారా ఇక్కడ క్లిక్ చేయండి
జనవరి నెల వరకు టికెట్స్ అయిపోయాయి. ఫిబ్రవరి నెలకు నవంబర్ 18 ఉదయం 10 గంటల విడుదల చేస్తున్నారు. లక్కీ డ్రా వేయడానికి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంది. లక్కీ డ్రా ఫలితాలు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు.
👉సుప్రభాతం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉తోమాల సేవ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉అర్చన కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉అష్టదళ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉తిరుప్పావడ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉మెల్చట్ వస్త్రం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉శ్రీవాణి టికెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆర్జిత సేవలు అనగా కళ్యాణం , ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం జనవరి నెల వరకు టికెట్స్ అయిపోయాయి. ఫిబ్రవరి నెలకు నవంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు. ఆన్ లైన్ సేవ టికెట్స్ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నారు. ఆన్ లైన్ సేవ బుక్ చేసిన వారికి సేవ ఉండదు దర్శనం ఉంటుంది.
👉కళ్యాణం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
👉ఊంజల్ సేవ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉ఆర్జిత బ్రహ్మోత్సవం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
👉సహస్ర దీపాలంకర సేవ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉ఆన్ లైన్ సేవ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా మాత్రమే టికెట్స్ ఇస్తున్నారు. జనవరి వరకు అయిపోయాయి. ఫిబ్రవరి నెలకు నవంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల. ఇవి ఫ్రీ టికెట్స్.అంగ ప్రదక్షిణ టికెట్స్ మొత్తం 750
అంగ ప్రదక్షిణ పూర్తీ సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా మాత్రమే టికెట్స్ ఇస్తున్నారు. జనవరి వరకు అయిపోయాయి. ఫిబ్రవరి నెలకు నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.
వయో వృద్దల దర్శనాల రూల్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జనవరి వరకు అయిపోయాయి. ఫిబ్రవరి నెలకు నవంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల.
300/- రూపాల దర్శనాల రూల్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తిరుమల అంటే కొండపైన , తిరుపతి అంటే కొండ క్రింద. రూమ్స్ జనవరి వరకు అయిపోయాయి. ఫిబ్రవరి నెలకు నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.
తిరుమల రూమ్ బుకింగ్ రూల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవంబర్ వరకు అయిపోయాయి. హోమం టికెట్స్ నెల రోజుల ముందు మాత్రమే విడుదల చేస్తున్నారు. డిసెంబర్ నెలకు నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల. హోమం టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఉదయం 9 గంటలకు హోమం లో పాల్గొనాలి మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం ఉంటుంది. టికెట్ ధర ఇద్దరికీ 1600
జనవరి నెలకు ఆన్ లైన్ లో అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. వైకుంఠ ఏకాదశి కి విడుదల చేయలేదు. వైకుంఠ ఏకాదశి కి మీరు బుక్ చేసినా మొదటి గడప దర్శనం ఉండదు. ఆఫ్ లైన్ లో తిరుమల కొండపైన JEO ఆఫీస్ గోకులం దగ్గర 900 టికెట్స్ఇస్తారు. ఆఫ్ లైన్ లో టికెట్ తీసుకున్న వారికి మరుసటి రోజు దర్శనం ఉంటుంది.
శ్రీవాణి టికెట్స్ దర్శనాల రూల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నెల రోజుల ముందు మాత్రమే ఈ టికెట్స్ విడుదల చేస్తున్నారు. నవంబర్ నెలకు అక్టోబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.లోకల్ టెంపుల్ సేవ అనగా గోవిందరాజుల ఆలయం , పద్మావతి ఆలయం లో సుప్రభాతం సేవ తో పాటు ఇతర సేవలు.
శ్రీవారి సేవ గురించి ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారం ఇస్తాము. ప్రస్తుతం డిసెంబర్ వరకు సేవ లు బుక్ అయ్యాయి. . ప్రస్తుతం ప్రతి నెల 27వ తేదిన విడుదల చేస్తున్నారు, జనవరి నెలకు అక్టోబర్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి 7 రోజుల సేవ , మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ , మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ విడుదల చేశారు.వైకుంఠ ఏకాదశికి మరల విడుదల చేస్తారు
👉శ్రీవారి సేవ బుకింగ్ రూల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉నవనీత సేవ బుకింగ్ రూల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉పరకామణి సేవ బుకింగ్ రూల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఏ సమాచారం కావాలో ఆ సమాచారం పై క్లిక్ చేయండి అవి ఓపెన్ అవుతాయి
👉కొత్త జంటకు పెళ్లికానుక శ్రీవారి కళ్యాణ అక్షింతలు
👉లక్ష నుంచి కోటి రూపాయల డొనేషన్ ఇచ్చేవారికి ఇచ్చే దర్శనాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉NRI దర్శనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉చంటి పిల్లల దర్శనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉తిరుమలలో తీర్ధాల సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉తుంబుర తీర్ధ ముక్కోటి కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉రామకృష్ణ తీర్ధ ముక్కోటి కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉కుమార ధార తీర్ధ ముక్కోటి కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉చక్రతీర్థ ముక్కోటి ఇక్కడ క్లిక్ చేయండి
👉రథసప్తమి ఎలా జరుగుతుంది తెలుసుకుందాం
👉తిరుమల చుట్టుప్రక్కల ఆలయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉వెంగమాంబ అన్నదాన సమయాలు
👉తిరుమల బస్సు మరియు సేవల సమయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
👉తిరుమల దర్శనాల గ్యాప్ వివరాలు
👉శ్రీవారికి నిత్యం ఎన్ని పూల దండాలు అలంకరిస్తారో తెలుసా?
👉తిరుమల శంఖ నిధి పద్మ నిధి విగ్రహాలు
👉శ్రీవారి ముడుపు కట్టే విధానం
మీరు టీటీడీ వారికీ మెయిల్ చెయ్యండి . రూమ్ కొరకు మీరు కట్టిన డబ్బులు రాకపోతే cd.refunddesk@tirumala.org కు మెయిల్ చేయండి వేరే ఏదైనా రిఫండ్ రాకపోతే refundservices.ttd@tirumala.org కు మెయిల్ చేయండి.
ఫోన్ నెంబర్ లు 08772263111, 08772264590
మీరు వారికి కాల్ చేసే ముందుగా మీ బ్యాంకు అకౌంట్ మరల ఒకసారి చెక్ చేసుకుని కాల్ చేయండి.
ద్వాదశ జ్యోతిర్లింగాలు వరుసగా 1. సోమనాథ్ 2. మల్లికార్జున 3. మహాకాళేశ్వర్ 4. ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం 5. బైద్యనాథ్ 6. భీమశంకర్ 7. రామేశ్వరం 8 . నాగేశ్వర్ 9 . విశ్వనాథ్ 10. త్రయంబకేశ్వర్ 11. కేదార్నాథ్ 12. ఘృష్ణేశ్వర
బైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ లో ఉంది, కాకపోతే బైద్యనాథ్ నే వైద్యనాథ్ అని మనవాళ్ళు చెబుతారు ఈ వైద్యనాథ్ క్షేత్రం మహారాష్ట్ర లో ఉంది.
రాష్ట్రాలవారీగా చూస్తే మీకు బాగా అర్ధమౌతుంది.
ఆంధ్రప్రదేశ్ - 1 శ్రీశైలం
ఉత్తరాఖండ్ - 1 కేధారేశ్వర్
తమిళనాడు - 1 రామేశ్వరం
ఉత్తరప్రదేశ్ - 1 కాశి విశ్వేశ్వర్
మధ్యప్రదేశ్ - 2 మహాకాళేశ్వర్ , ఓంకారేశ్వర
గుజరాత్ -2 సోమనాథ్ , నాగేశ్వర్
మహారాష్ట్ర - 4 వైద్యనాథ్ , త్రయంబకేశ్వర్ , భీమశంకర్ , ఘృష్ణేశ్వర
జ్యోతిర్లింగ క్షేత్రాల కోసం వివరంగా తెలుసుకోవడానికి ఫోటో పై క్లిక్ చేయండి
సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలే శక్తి పీఠ క్షేత్రాలు. ఇవి 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే ప్రధానమైనవి అష్టాదశ శక్తి పీఠాలు అవి వరుసగా :
1. శాంకరి దేవి శక్తి పీఠం - శ్రీలంక లో ఉంది
2. కామాక్షి అమ్మవారు - కాంచీపురం
3. శృంఖల దేవి శక్తి పీఠం - పశ్చిమ బెంగాల్
4. చాముండేశ్వరి అమ్మవారు - మైసూరు
5. జోగులాంబ అమ్మవారు - ఆలంపూర్, తెలంగాణ
6. భ్రమరాంబిక అమ్మవారు - శ్రీశైలం
7. మహాలక్ష్మి అమ్మవారు - కొల్హాపూర్
8. ఏకవీరిక (రేణుకా మాత) - మహారాష్ట్ర
9. మహాకాళి - ఉజ్జయిని
10.పురుహూతిక అమ్మవారు - పిఠాపురం పాదగయ క్షేత్రం
11.గిరిజ దేవి - జాజ్‌పూర్
12. మాణిక్యాంబ అమ్మవారు - ద్రాక్షారామం
13. కామరూప - గౌహతి నుండి 18 కిలోమీటర్లు
14. మాధవేశ్వరి - ప్రయాగ
15. వైష్ణవి దేవి - కాట్రా
16. మంగళ గౌరి - గయ
17. విశాలాక్షి - కాశీ క్షేత్రం
18. సరస్వతి - జమ్మూకాశ్మీర్
రాష్ట్రాల వారీగా చూస్తే
ఆంధ్ర ప్రదేశ్ లో - 3 శక్తి పీఠాలు కలవు. శ్రీశైలం లో భ్రమరాంబిక అమ్మవారు , పిఠాపురం లో పురుహూతికా అమ్మవారు , ద్రాక్షారామం లో మాణిక్యాంబ అమ్మవారు ఉన్నారు
మహారాష్ట్ర లో - 2 శక్తి పీఠాలు కలవు , కొల్హాపూర్ లో మహాలక్ష్మీ అమ్మవారు , షిర్డీ కి దగ్గర్లో ఏకవీర శక్తి పీఠం.
ఉత్తరప్రదేశ్ లో- 2 శక్తి పీఠాలు కలవు, ప్రయాగ లో మాధవేశ్వరి అమ్మవారు , కాశీ లో విశాలాక్షి అమ్మవారు
తెలంగాణ - 1 , జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం ఆలంపూర్ లో కలదు.
తమిళనాడు - 1 కాంచీపురం లో కామాక్షి అమ్మవారు
కర్ణాటక - 1 మైసూర్ లో చాముండేశ్వరి శక్తి పీఠం
పశ్చిమ బెంగాల్-1, శృంఖలా దేవి శక్తి పీఠం
మధ్యప్రదేశ్- 1: మహాకాళి శక్తి పీఠం ఉజ్జయిని క్షేత్రం లో కలదు
ఒడిషా - 1: లో జాజిపూర్ లో గిరిజ దేవిశక్తి పీఠం
అసోం - 1 : కామరూప శక్తి పీఠం గౌహతి నుంచి 18 కిమీ దూరం లో కలదు.
హిమాచల్ ప్రదేశ్ 1 : కాట్రా లో కొండపైన వైష్ణవి దేవి శక్తి పీఠం కలదు
బీహారు 1 : మంగళ గౌరి శక్తి పీఠం గయ క్షేత్రం లో ఉంది
జమ్మూకాశ్మీర్ 1 : లో సరస్వతి శక్తి పీఠం ఉండేది
శ్రీలంక :లో శాంకరి దేవి శక్తి పీఠం కలదు
శక్తి పీఠాల కోసం వివరంగా తెలుసుకోవడానికి ఫోటో పై క్లిక్ చేయండి

















సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ తారకాసురుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడింది , ఆ 5 క్షేత్రాలే పంచారామ క్షేత్రాలు. ఈ క్షేత్రాలు 5 ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాయి. మీకు పాత జిల్లాలు చెబితేనే త్వరగా అర్ధమౌతుంది.
తూర్పుగోదావరి జిల్లాలో 2 క్షేత్రాలు కలవు
1. సామర్లకోట లోని శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం , ప్రస్తుతం కాకినాడ జిల్లా లో ఉంది.
2. ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయం , ప్రస్తుతం కోనసీమ జిల్లా లో ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా లో 2 క్షేత్రాలు కలవు
1. పాలకొల్లు లోని క్షీరారామం క్షేత్రం
2. భీమవరం గునిపూడి లో సోమారామం
గుంటూరు జిల్లాలో 1 క్షేత్రం కలదు
1. అమరేశ్వరస్వామి దేవాలయం అమరావతి లో కలదు, ప్రస్తుతం పల్నాడు జిల్లా లో ఉంది.
ఈ క్షేత్రాలన్నీ ఒకే వరసలో ఉన్నాయి. మీరు గుంటూరు నుంచి మొదలు పెట్టినా లేదా సామర్లకోట నుంచి చూసుకుంటూ వెళ్లినా అన్ని వరుసగా చూడవచ్చు. కార్తికమాసం లో భక్తులు పంచారామ క్షేత్రాలన్నీ ఒకేరోజు దర్శిస్తారు
ఒక్కో క్షేత్రం గురించి వివరంగా తెలుసుకోవడానికి క్రింద ఫోటో పై క్లిక్ చేయండి
ఓం నమః శివాయ .. పంచభూత లింగ క్షేత్రాలలో 4 క్షేత్రములు తమిళనాడు లో కలవు. ఒకటి ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి లో ఉంది.
1. 🛕ఆకాశలింగం చిదంబరం లో కలదు. ఆలయం పేరు నటరాజ స్వామి ఆలయం . చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ ఆలయ ప్రాంగణం లో 108 దివ్య క్షేత్రాలలో ఒకటైన గోవిందరాజుల స్వామి ఆలయం కూడా ఉంది ఈ ఆలయం పక్కనే చిత్రగుప్తుడికి కూడా సన్నది కలదు.
2. 🛕పృథ్వీ లింగం కాంచీపురం లో కలదు.ఆలయం పేరు ఏకాంబరేశ్వర దేవాలయం. ఈ ఆలయం లో ఆశ్చర్యం కలిగించే విషయం 3500 సంవత్సరాల వయస్సు కలిగిన మామిడి చెట్టు కలదు. ఈ మధ్య కాలం లోనే పడిపోయింది మామిడి కాండాన్ని ఆలయం లో చూడవచ్చు. ఇక్కడ లింగానికి జలాభిషేకం ఉండదు.
🛕3. వాయు లింగం శ్రీకాళహస్తి లో కలదు. స్వామి వారి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ. స్వామి వారికి ఎదురుగా ఉన్న దీపాలు కదలడం మనం గమనించవచ్చు. రాహుకేతు పూజలు ప్రతి రోజు చేస్తారు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు.
4. 🛕జలలింగం మనం జంబుకేశ్వరం అని పిలుస్తాము తమిళం వారు తిరువానైక్కావల్ అని పిలుస్తారు. ఈ క్షేత్రం శ్రీరంగం నుంచి 2 కిమీ దూరం లో ఉంది.
5 .🛕 అగ్ని లింగం అరుణాచలం లో ఉంది తమిళం లో తిరువణ్ణామలై అని పిలుస్తారు. ప్రతి పౌర్ణమి కి వేలల్లో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ప్రతి రోజు కూడా ఇక్కడ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. కొండనే శివునిగా భావిస్తారు. మీరు పైన ఉన్న బటన్ లలో అరుణాచలం పై క్లిక్ చేస్తే పూర్తి వివరాలు ఉంటాయి.
Comments
Post a Comment